
రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి
భూపాలపల్లి రూరల్: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలని, ఐదు నెలల కమీషన్లు, పాత బకాయిలను విడుదల చేయాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లస్వామి గౌడ్, కార్యదర్శి నిమ్మల భద్రయ్య మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి రూ.5వేల గౌరవ వేతనం, రూ.300 కమీషన్‌ను పెంచాలని వివిధ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రం ఇచ్చామన్నారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు 5నెలల కమీషన్ చెల్లించాలని, డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేదంటే రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న రాష్ట్ర బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు, డీలర్లు పాల్గొన్నారు.
సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి