
450 మందికి వైద్య పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపులో 450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన హెల్త్ క్యాంపును ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన స్పెషలిస్టు డాక్టర్ హాజరై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్మికుల కోరిక మేరకు సీఎండీ, డైరెక్టర్ల ఆదేశాల మేరకు సూపర్‌స్పెషలిటీ క్యాంపు నిర్వహించినట్లు జీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం కవీంద్ర, అధికారులు నజీర్, మారుతి, నాయకులు విజేందర్, శేషారత్నం, ఇన్‌చార్జ్ ఏసీఎంజో డాక్టర్ గోపికృష్ణ, స్పెషలిస్టు డాక్టర్లు పాల్గొన్నారు.