
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: చిట్యాల, మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలిక పద్ధతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిట్యాల సీహెచ్‌సీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు 12, మహదేవపూర్ సీహెచ్‌సీ 9..సివిల్ అసిస్టెంట్ సర్జన్ చిట్యాల సీహెచ్‌సీ 2, మహదేవపూర్ సీహెచ్‌సీ 3 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల డాక్టర్లు ఈ నెల 26వ తేదీలోపు చిట్యాల సీహెచ్‌సీలో అందించాలని 28వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.