
పల్లెల అభివృద్ధి కోసమే పనుల జాతర
చిట్యాల: పల్లెల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికే ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఈఈ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, ఎంపీడీఓ జయశ్రీ, డీఆర్‌డీఓ బాలకృష్ణ, నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, గుమ్మడి సత్యం, గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
జీపీ భవనం ప్రారంభం
టేకుమట్ల మండలం మందలోరిపల్లిలో రూ.20లక్షల నిధులతో ఇటీవల నిర్మించిన గ్రామ పంచాయ తీ భవనాన్ని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శిని అధికారులు సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, ఆర్‌ఐ సంతోష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు