
నీతి అయోగ్ అధికారుల పర్యటన
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నీతి అయోగ్ అధికారుల బృందం పర్యటించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. సెంట్రల్ నోడల్ అధికారి డాక్టర్ రమణ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలో పర్యటించి జిల్లాలో వైద్యారోగ్యశాఖ కార్యక్రమాలు, పురోగతిని తెలుసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పలిమెల పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలపై డీఎంహెచ్‌ఓ నీతి అయోగ్ బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నాలుగు రోజుల పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సీహెచ్‌సీలను తనిఖీ చేస్తూ ప్రజలు, ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో మాట్లాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ ప్రమోద్‌కుమార్, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.