
పారితోషికాలు వెంటనే విడుదల చేయాలి
ములుగు రూరల్: ఆశ వర్కర్లకు గతనెల పారితోషికాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని రాయినిగూడెం పీహెచ్‌సీ ఎదుట ఆశ వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ అన్వేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ. 18 వేల ఫిక్స్‌డ్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. జూలై నెల పారితోషికాలు విడుదల చేయకపోవడంతో ఆశ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఆశ కార్యకర్తలకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 6 నెలల పీఆర్‌సీ విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఈశ్వరి, సారలక్ష్మి, స్వర్ణ, వజ్ర, కవిత, జ్యోత్స్న, యశోద, రజిత, రమాదేవి, మల్లిక పాల్గొన్నారు.