నిలిచిన బొగ్గు ఉత్పత్తి
మల్హర్: కుంభంపల్లిలోని పొలాల్లోకి చేరిన వరద నీరు
మల్హర్: ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో కుంభంపల్లి పొలాల్లోకి వరద నీరు చేరింది. కొండపేట బొమ్మరాపు వాగు ఉధృతి పెరగడంతో పాటు కుంభంపల్లి గ్రామంలో 50 ఎకరాల్లో సాగు చేసిన వరి పొలాలు నీట ముని గాయి. మల్లారం ఆరెవాగు, తాడిచర్ల ఖమ్మపల్లి మానేరులో నీటి ప్రవాహం పెరుగుతుంది. తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయిందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. వర్షాల కారణంగా 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ, 6వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
రాకపోకలకు అంతరాయం
కాటారం: కాటారం, మహాముత్తారం మండలంలో సోమవారం ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారిపోయాయి. కాటారం మండలం మేడిపల్లి టోల్‌గేట్ వద్ద వరద నీరు భారీగా చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మహాముత్తారం మండలం కేశవపూర్–నిమ్మగూడెం మధ్యలోని పెద్దవాగు కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి.
చండ్రుపల్లి వాగును కమ్మేసిన వరద
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారం–మద్దులపల్లి ప్రధాన రహదారిపై చండ్రుపల్లి వాగును గోదావరి వరద నీరు కమ్మేసింది. లో లెవల్ వంతెన కావడంతో అన్నారం టు కాళేశ్వరం వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
భూపాలపల్లి అర్బన్: వర్షం కారణంగా భూపాలపల్లి ఏరియాలోని రెండు ఓపెన్ కాస్టుల్లో సోమవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సొమవారం మూడు షిప్టుల్లో కేటీకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్–2, 3లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సుమారు 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిలిచిపోయింది. ఓపెన్ కాస్టులో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఓపెన్‌కాస్టులోని పని స్థలాల్లో చేరిన వరద నీటిని ఎప్పటికప్పుడు తోడిపోసేందుకు అధికారులు భారీ సామర్థ్యం కలిగిన మోటార్లు ఏర్పాటు చేశారు.
కాటారం డివిజన్‌లో వర్షం
ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
నీట మునిగిన పొలాలు
నీట మునిగిన పొలాలు
నీట మునిగిన పొలాలు