
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: శ్రావణ సోమవారం సందర్భంగా కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి వారికి అభిషేకాలు చేశారు. అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో లక్ష మారేడు బిల్వ దళాలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన నందీశ్వరుని రెండవ వార్షికోత్సవం కావడంతో త్రివేణి సంగమ జలాలు, పంచామృతాలతో నందీశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు.
నందీశ్వరుడి వద్ద పూజల్లో పాల్గొన్న భక్తులు

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు