
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
మహాముత్తారంలో నిలిచిన రాకపోకలు
మత్తడి పడుతున్న బొగ్గులవాగు
కాటారం: మహాముత్తారం మండలకేంద్రానికి సమీపంలోని కోనంపేట వాగు, కేశవపూర్, నిమ్మగూడెం గ్రామాల మధ్య గల పెద్ద వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. వరద నీరు ప్రధాన రహదారుల వంతెనల పై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు అవతలి వైపు గల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు వైపుగా వెళ్లే వాహనదారులు గంటల కొద్ది నిరీక్షించాల్సి వచ్చింది. వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు హోల్డింగ్‌లు అడ్డుగా పెట్టడంతో పాటు పర్యవేక్షణకు సిబ్బందిని ఏర్పాటు చేశారు.