
ప్రగతి వైపు పయనం
భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లతో పేదల్లో సంతోషం
భూపాలపల్లి: ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఫలితంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రగతి వైపు పయనిస్తుందని తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్, కో–ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బెల్లయ్యనాయక్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యఅతిథిగా హాజరై, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి తొలుత జాతీయజెండాను ఎగురవేసి పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును బెల్లయ్య నాయక్ వివరించారు. వివరాలు ఆయన మాటల్లో..
అన్నదాతలకు అండగా ప్రజా సర్కారు
విద్య, వైద్యం, విద్యుత్ రంగాలకు పెద్దపీట
జిల్లా ఆస్పత్రిలో త్వరలోనే సీటి స్కాన్ సేవలు
రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

ప్రగతి వైపు పయనం