దేశ సేవకు పునరంకితం కావాలి | - | Sakshi
Sakshi News home page

దేశ సేవకు పునరంకితం కావాలి

Aug 16 2025 7:09 AM | Updated on Aug 16 2025 7:09 AM

దేశ స

దేశ సేవకు పునరంకితం కావాలి

దేశ సేవకు పునరంకితం కావాలి చెక్కుల పంపిణీ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా హరీశ్‌రెడ్డి గుడుంబా స్థావరాలపై దాడులు ‘అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం’

భూపాలపల్లి: ప్రతీ పౌరుడు దేశ సేవకు పునరంకితం కావాలని ఎస్పీ కిరణ్‌ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ.. జాతీయ జెండాను ఎగరవేసి జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

రేగొండ: మండలంలోని కొడవటంచ గ్రామంలో కటంగూరి ఉదయశ్రీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా 20మంది నిరుపేదలకు రూ.20వేల విలువ చేసే చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడం గొప్పతనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నవీన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సంపత్‌ రావు, పులి తిరుపతిరెడ్డి, రవీందర్‌రావు, పబ్బ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి మాడ హరీశ్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్వర్తులు జారీచేశారు. తనకు మరో సారి జిల్లా బాధ్యతలు అప్పగించడం పట్ల హరీశ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందుకు జిల్లాలో జాగృతిని బలోపేతం చేస్తామని హరీశ్‌రెడ్డి తెలిపారు.

మల్హర్‌: కొయ్యూరు, వల్లెకుంట గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై శుక్రవారం కొయ్యూరు పోలీసులు దాడులు నిర్వహించారు. వల్లెకుంట గ్రామంలో ఇంట్లో నిల్వ ఉంచిన 20లీటర్లు, 14లీటర్లు గుడుంబాను స్వాదీనం చేసుకొని గుడుంబా తయారీ సామగ్రిని ధ్వంసం చేసినట్లు కొయ్యూరు ఎస్సై నరేశ్‌ తెలిపారు. రఘు, లక్ష్మికోయ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై 2 రజన్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కాటారం: రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజబాబు, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దండ్రు రమేశ్‌, కాటారం ప్రచార కమిటీ చైర్మన్‌ కుంభం రమేశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంథని డిగ్రీ కళాశాలను సందర్శించి మంత్రి శ్రీధర్‌బాబుపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మళ్లీ విచారణ జరపాలని సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పుట్ట మధుకు భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంత్రి శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గంలో పలు ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులకు అందుబాటులో ఉన్నత చదువులు తీసుకొచ్చిన ఘనత శ్రీధర్‌బాబుకు దక్కుతుందని అన్నారు. ఈ సమావేశంలో యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్‌, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, నాయకులు భూపెల్లి రాజు పాల్గొన్నారు.

దేశ సేవకు  పునరంకితం కావాలి
1
1/1

దేశ సేవకు పునరంకితం కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement