
మహనీయుల సేవలు స్మరించుకోవాలి
భూపాలపల్లి: స్వాతంత్య్ర సముపార్జన కోసం పోరాడిన మహనీయులను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మ జాతీయ జెండాను ఎగురవేశారు. తన సతీమణి కతియాని జునేజాతో కలిసి విద్యార్థినులకు స్వీట్లు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ ఐడీఓసీ కార్యాలయానికి చేరుకొని జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన వారిని స్మరించుకున్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ

మహనీయుల సేవలు స్మరించుకోవాలి