
విద్యకు ప్రభుత్వం పెద్దపీట
టేకుమట్ల: విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావుపల్లిలోని ఉన్నత పాఠశాలలో డైనింగ్‌హాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తమ విద్యతో పాటు విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన నేరేళ్ల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె సభ్యులను కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
రేగొండ: మండలంలోని కొడవటంచ గ్రామానికి చెందిన మూల సారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సంపత్‌రావు, తిరుపతిరెడ్డి, రవీందర్ రావు, శ్రీనివాస్, మూల ఓంకార్ ఉన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు