
అవార్డు పొందడం సంతోషం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు యాస్పిరేషన్ అంశాలలో రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్ శర్మ అవార్డు తీసుకున్నారని, ఇది మనందరికీ గర్వకారణమని బెల్లయ్య నాయక్ అన్నారు. ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను బెల్లయ్యనాయక్ ప్రారంభించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అధి కారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, ఆర్డీఓ రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.