వర్షానికి కూలిన ఇల్లు | - | Sakshi
Sakshi News home page

వర్షానికి కూలిన ఇల్లు

Aug 15 2025 6:46 AM | Updated on Aug 15 2025 6:46 AM

వర్షా

వర్షానికి కూలిన ఇల్లు

వర్షానికి కూలిన ఇల్లు బుగులోని గుట్టల పరిశీలన బీజేపీ జిల్లా కమిటీ ఎన్నిక బొగ్గు ఉత్పత్తిపై ఖర్చు తగ్గించాలి

కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి దౌతుపల్లికి చెందిన మడప ధర్మయ్య ఇల్లు గురువారం ఒక్కసారిగా నేలమట్టమైంది. వర్షాలకు ఇంటి గోడలు, పై కప్పు పూర్తిగా తడిచిపోవడంతో కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు ప్రాణాపాయం తప్పిందని ధర్మయ్య తెలిపారు. ఇంట్లో నిల్వ ఉన్న నిత్యవసర సరుకులు, సామగ్రి, బట్టలు పూర్తిగా ధ్వంసమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని ధర్మయ్య వేడుకుంటున్నాడు.

రేగొండ: తిరుమలగిరి శివారులోని బుగులోని గుట్టలను గురువారం జిల్లా అధికారులు పరిశీలించారు. జాతరలో పలు అభివృద్ధి పనులకు రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. జాతరలో చేపట్టాల్సిన పనులను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి నమూనాలు తీసుకున్నారు. జాతర సమయానికి పనులను పూర్తి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్‌, పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈలు రవికుమార్‌, సతీష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ శ్వేత, ఫారెస్ట్‌ డివిజన్‌ అధికారి అప్పల కొండ, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ నరేష్‌, నాయకులు నిమ్మల విజేందర్‌, రొంటాల వెంకటస్వామి, గంగుల రమణారెడ్డి, పాల్గొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: బీజేపీ జిల్లా కమిటీని 20మందితో ఎన్నుకున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని బీఎంఎస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా దాసరి తిరుపతిరెడ్డి, మోరే రవీందర్‌ రెడ్డి, వేషాల సత్యవతి, కోడెపాక స్వరూప, సామల మధుసూదన్‌ రెడ్డి, గొర్రె శశి కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా దొంగల రాజేందర్‌, తాటికంటి రవికుమార్‌, పెండ్యాల రాజు, కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిశిధర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం జాతీయ జెండా చేత బూని బీఎంఎస్‌ కార్యాలయం నుంచి భూపాలపల్లి కూడలి వరకు తిరంగా యాత్ర చేశారు.

భూపాలపల్లి అర్బన్‌: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తితో పాటు ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఏరియాలోని కేటీకే 2వ గనిలో మల్టీ డిపార్ట్‌మెంటల్‌ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడానికి, పని గంటలు పెంచుతూ యంత్రాలను నడపాలన్నారు. భద్రతతో కూడిన ఉత్పత్తి సాధించాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, అంకితభావంతో పనిచేయాలన్నారు. భద్రత పట్ల అశ్రద్ధ వహించకుండా అధికారులు, సూపర్‌వైజర్‌లు, సంబంధిత ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యోగుల గైర్హాజరు శాతాన్ని తగ్గించాలని విధులకు రానీ ఉద్యోగులను సంస్థలో నుంచి తొలగించే ప్రక్రి య కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జ్యోతి, రాజేశ్వర్‌, కృష్ణ ప్రసాద్‌, మారుతి, రమాకాంత్‌, కృష్ణయ్య, ప్రశాంత్‌, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నా యకులు రమేష్‌, మధుకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

వర్షానికి కూలిన ఇల్లు
1
1/2

వర్షానికి కూలిన ఇల్లు

వర్షానికి కూలిన ఇల్లు
2
2/2

వర్షానికి కూలిన ఇల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement