
వేడుకలు చూద్దాం రండి..
భూపాలపల్లి: 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలకు జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియం వేదిక కానుంది. వేడుకలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయగా ప్రభుత్వం తరఫున తెలంగాణ షెడ్యుల్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బెల్లయ్యనాయక్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
వేడుకల నిర్వహణ ఇలా..
నేటి ఉదయం 9.28 గంటలకు ముఖ్యఅతిథి అంబేడ్కర్ స్టేడియం చేరుకొని 9.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 9.55 నుంచి 10 గంటల వరకు పరేడ్, అనంతరం స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, 10.20 నుంచి 12.45 గంటల వరకు పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, తదుపరి ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాల పంపిణీ, 11.25 గంటలకు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు.
ఏర్పాట్లు పూర్తి..
స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. అంబేడ్కర్ స్టేడియాన్ని ముస్తాబు చేశారు. స్టేజీని అందంగా తీర్చిదిద్దడంతో పాటు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా షామియానాలు, కుర్చీలు, తాగునీటి సదుపాయం కల్పించారు. వేడుకల ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా అధికారులు పరిశీలించారు.
నేడు స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు
ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్
వేడుకలకు వేదిక కానున్న
అంబేడ్కర్ స్టేడియం

వేడుకలు చూద్దాం రండి..