మహాముత్తారం సబ్‌స్టేషన్ సమీపంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగు
కలెక్టరేట్, జీజీహెచ్‌లోకి చేరిన వరద నీరు
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి చుట్టూ వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. కలెక్టరేట్ ప్రధాన ద్వారం, గార్డెన్ వరద నీటితో నిండిపోయింది. టీ హబ్ చుట్టూ నీరు నిలవడంతో విద్యుత్ వైర్లకు సంబంధించిన ఎర్త్ నీటిలో మునగడంతో ఎక్స్‌రే యంత్రాలు పనిచేయలేదు. ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని బాంబులగడ్డ, రాజీవ్‌నగర్‌కాలనీ, సుందరయ్యనగర్, భగత్‌సింగ్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో రెవెన్యూ అధికారులు నీటిని మళ్లించారు.
గొల్లబుద్దారం పాఠశాల జలమయం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని గద్దగుంట వాగు పొంగిపొర్లడంతో భూపాలపల్లి నుంచి రాంపూర్ మీదుగా అటవీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. దీంతో హైస్కూల్ మీదుగా పోచమ్మ గుడి వరకు కూడా రోడ్లపై నీరు చేరింది. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో పాఠశాల ప్రాంగణం ఒక చిన్న చెరువును తలపించింది. దాదాపు 400 మంది విద్యార్థులు.. ఉపాధ్యాయులు పాఠశాల లోపలే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన ప్రధానోపాధ్యాయులు వెంటనే స్పందించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తగు జాగ్రత్తలతో ఒక్కొక్క విద్యార్థిని సురక్షితంగా ఇంటికి పంపించారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న
వాగులు
కాటారం: మహాముత్తారం మండలంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగుల్లోకి వరదనీరు చేరి ఉప్పొంగి ప్రవహించాయి. మహాముత్తారం సబ్‌స్టేషన్ సమీపంలోని కోనంపేటవాగు, కేశవపూర్–నిమ్మగూడెం మధ్య గల పెద్దవాగులు కాజ్‌వేపై నుంచి ప్రవహించడంతో సుమారు నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉప్పొంగడంతో మేడారం వైపుగా వెళ్లే వాహనాలు కొంత సమయం పాటు నిరీక్షించాల్సి వచ్చింది. వాగులు దాటకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టారు.
జిల్లా కేంద్రంలో భారీ వర్షం
జిల్లా కేంద్రంలో భారీ వర్షం
జిల్లా కేంద్రంలో భారీ వర్షం
జిల్లా కేంద్రంలో భారీ వర్షం
జిల్లా కేంద్రంలో భారీ వర్షం
జిల్లా కేంద్రంలో భారీ వర్షం
జిల్లా కేంద్రంలో భారీ వర్షం