సూపర్‌ స్పెషాలిటీ వైద్యులతో పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్పెషాలిటీ వైద్యులతో పరీక్షలు

Aug 12 2025 8:05 AM | Updated on Aug 13 2025 4:52 AM

సూపర్

సూపర్‌ స్పెషాలిటీ వైద్యులతో పరీక్షలు

భూపాలపల్లి అర్బన్‌: ఈ నెల 24న భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుండె, నరాల, జనరల్‌ ఫిజీషియన్‌, మూత్రపిండాల, జీర్ణాశయ పేగుల వైద్య నిపుణులు, జనరల్‌ సర్జన్లు రానున్నట్లు తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులకు చూపించుకోవాల్సిన వారు ముందుగా ఏరియా ఆస్పత్రిలో సంబందిత వైద్యుల వద్ద పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. వారి సూచనల మేరకు స్పెషలిస్టు డాక్టర్‌ కోసం ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

సాయి దీప్య

మెయిన్స్‌కు ఎంపిక

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన చకినారపు సమ్మయ్య–విజయ కుమార్తె సాయిదీప్య సివిల్స్‌ మెయిన్స్‌కు ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్‌లో ‘రాజీవ్‌గాంధీ అభయ హస్తం’ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతులమీదుగా రూ. లక్ష చెక్కును అందుకుంది. ఆమె ఇటీవల ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చాటగా, ఈనెల 22న మెయిన్స్‌ పరీక్షలకు హాజరు కానుంది. దీంతో ఆమెతో పాటు తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

ఎరువుల కృత్రిమ కొరత

సృష్టిస్తే చర్యలు

కాటారం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మహదేవపూర్‌ ఏడీఏ శ్రీపాల్‌ హెచ్చరించారు. మండలకేంద్రంలోని పలు ఎరువులు, పురుగుల మందు దుకాణాలను సోమవారం ఏడీఏ తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, యూరియా అమ్మకాలు, స్టాక్‌ నిల్వలను పరిశీలించారు. ఎరువులు, పురుగుల మందుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను, స్టాక్‌ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని నిర్వాహకులను ఏడీఏ ఆదేశించారు. ప్రతి కొనుగోలుపై రైతులకు బిల్లు ఇవ్వాలని సూచించారు. రైతులకు యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని లింకు ఎరువులు అంటగట్టవద్దని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అన్నపూర్ణ ఫర్టిలైజర్‌ దుకాణంలో రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంతో అమ్మకాలు నిలిపివేయాలని ఏడీఏ ఆదేశించారు. ఏడీఏ వెంట ఏఓ పూర్ణిమ ఉన్నారు.

సీఐగా వెంకటేశ్వర్లు

బాధ్యతల స్వీకరణ

కాళేశ్వరం: మహదేవపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా నల్లగట్ల వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాటారంలో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

ఇసుక డంప్‌ సీజ్‌

టేకుమట్ల: మండలంలోని రామకిస్టాపూర్‌(వి) శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసిన సుమారు 70 ట్రాక్టర్ల ఇసుక డంప్‌ను అధికారులు సీజ్‌ చేశారు. తహసీల్దార్‌ విజయలక్ష్మి ఆదేశాల మేరకు సోమవారం హెడ్‌ కానిస్టేబుల్‌ మల్లన్న, కానిస్టేబుల్‌ నాగరాజుతో కలిసి ఆర్‌ఐ సంతోష్‌కుమార్‌ ఇసుక డంపును సీజ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను డంప్‌ చేసినా, తరలించినా వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీజ్‌ చేసిన ఇసుక డంపును నేడు(మంగళవారం) వేలం వేయనున్నట్లు తెలిపారు.

సూపర్‌ స్పెషాలిటీ  వైద్యులతో పరీక్షలు
1
1/2

సూపర్‌ స్పెషాలిటీ వైద్యులతో పరీక్షలు

సూపర్‌ స్పెషాలిటీ  వైద్యులతో పరీక్షలు
2
2/2

సూపర్‌ స్పెషాలిటీ వైద్యులతో పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement