
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం
భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ కిరణ్ ఖరే జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 19మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. పలు సమస్యలపై అప్పటికప్పుడు స్పందించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రజా దివస్‌లో వచ్చే ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు.
ఎస్పీ కిరణ్ ఖరే