
రెడ్డి కార్పొరేషన్‌ను ప్రకటించాలి
రేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెడ్డి కార్పొరేషన్‌ను తక్షణమే ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని భాగిర్థిపేట గ్రామంలో రూపిరెడ్డి విజేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ రంగాల్లో రెడ్లు వెనుకబడుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషిచేయాలన్నారు. రెడ్డి కులస్తుల సంక్షేమం కోసం తగు చర్యలను తీసుకోవాలని కోరారు. అనంతరం రెడ్డి సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామిడి సతీష్‌రెడ్డి, పత్తి బుచ్చిరెడ్డి, పాపిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి