
హక్కులను తెలుసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: గిరిజన హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం సమావేశం నిర్వహించా రు. గిరిజన హక్కుల పరిరక్షణ, హక్కుల విని యోగం అనే అంశంపై జడ్జి మాట్లాడారు. విద్యార్థులు హేతుబద్ధమైన ప్రశ్నలు వేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రశ్నించడం మర్చిపోయిన వ్యక్తి తన ఉనికిని కోల్పోతాడని చెప్పాడు. విద్యార్థులు పోషక ఆహారాన్ని భుజించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుకోవడం సాధ్యమవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్, జీపీ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు, పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సమ్మయ్యనాయక్, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.