
నేడు కాళేశ్వరాలయంలో వరలక్ష్మీవ్రతాలు
కాళేశ్వరం: శ్రావణమాసం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం శుక్రవారం సందర్భంగా (నేడు)సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ ఎస్.మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు.
మిరప నర్సరీలు తనిఖీ
చిట్యాల: మండలంలోని జూకల్, చల్లగరిగ గ్రామ శివారులలో నర్సరీలను జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎడ్ల సునీల్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరంలో 10 మిరప నర్సరీలకు లైసెన్స్‌లు రెన్యువల్ చేసినట్లు తెలిపారు. లైసెన్స్‌దారులు నర్సరీ చట్టం ప్రకారం విధిగా నిబంధనలు పాటించాలని కోరారు. నర్సరీ నిర్వహణలో రిజిస్టర్‌లు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. నర్సరీ చట్టం ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.