
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా కమిటీ సమావేశంలో వెంకటేష్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్, శ్రీకాంత్, దేవేందర్, సుజాత, కవిత, స్వర్ణ, స్వాతి పాల్గొన్నారు.