
జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
భూపాలపల్లి అర్బన్: స్వరాష్ట్ర సాధనలో జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం జయశంకర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ రాహుల్‌శర్మ జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ మురళీధర్ అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా జయంతి వేడుకలు
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి పూలమాల వేశారు. జిల్లా వ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఆచార్య జయశంకర్‌ను
స్ఫూర్తిగా తీసుకోవాలి
కలెక్టర్ రాహుల్‌శర్మ

జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు

జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు