
చిన్న వానలకే నిలుస్తున్న రాకపోకలు..
మొగుళ్లపల్లి మండలంలోని ములకపల్లి– మొగుళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న కాజ్ వే చిన్నపాటి వర్షానికి సైతం వరద నీటితో నిండిపోతుంది. దీంతో ఇరువైపులా ఉన్న గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఇతర గ్రామాల మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎనిమిది నెలల క్రితం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో వరదలు వస్తే తమ పరిస్థితి ఏంటని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.