
చిన్నపాటి వర్షానికే..
గణపురం మండలకేంద్రంలోని పరకాల–ములుగు ప్రధాన రహదారి చినుకుపడితే చిత్తడిగా మారుతుంది. మంగళవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచి కుంటలను తలపించింది. గుంతలు ఏర్పడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
– గణపురం
గణపురం గణపసముద్రం చెరువు నుంచి మిషన్ భగీరథ పథకంలో భాగంగా పైప్‌లైన్లు వేసి నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వందలాది కిలోమీటర్లు పైప్‌లైన్లు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో గణపురం మండలకేంద్రంలో ధర్మరావుపేట ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్‌లైన్లు రోడ్డుపైకి తేలాయి. వాహనాలు పైప్‌లైన్లపైకి ఎక్కితే పగిలే అవకాశం ఉంది. – గణపురం

చిన్నపాటి వర్షానికే..