
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని సింగరేణి గనుల్లో గాలి కొరత, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సరైన పనిముట్లు లేవన్నారు. యంత్రాలకు మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలమైనట్లు ఆరోపించారు. ఈ సమస్యలపై అధికారులతో మాట్లాడితే పరిష్కరించకపోగా కార్మికులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి జనార్దన్, శ్రీనివాస్, బాబు, జయశంకర్, నరసింహారెడ్డి, సలీం, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.