
బ్యాక్ వాటర్‌తో ముప్పు..
మహదేవపూర్ మండలం చండ్రుపల్లి వాగుపై ఉన్న లో లెవల్ కల్వర్టు మీదుగా వర్షాకాలంలో గోదావరి నది బ్యాక్ వాటర్ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అన్నారం నుంచి పలుగుల మీదుగా కాళేశ్వరం, కాళేశ్వరం మీదుగా అన్నారం వెళ్లే వాహనాల రాకపోకలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. సుమారు రెండు నెలల పాటు ఇదే పరిస్థితి నెలకొంటుండంతో స్థానికులు కాళేశ్వరం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్ల క్రితం ఓ టూరిస్ట్ బస్సు కాళేశ్వరం వస్తుండగా వరద నీరు భారీగా వచ్చి కల్వర్టులో బస్సు చిక్కుకుంది. అప్పటి ఎస్సై శ్రీనివాస్ తాళ్ల సహాయంతో బస్సులోని భక్తులను సురక్షితంగా బయటకు తరలించడంతో పెద్ద ముప్పు తప్పింది.