6
సివిల్స్‌లో మెరిశారు..
రాష్ట్రస్థాయిలో
జిల్లాకు
వ స్థానం
● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు ఎంపిక
● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్‌వాసే
● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు
● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు
● ఐఏఎస్ కావాలనే లక్ష్యంతోనే ముందుకు..
● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటిర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకులు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్‌వర్క్
ప్రభుత్వ కళాశాలల్లో టాపర్లు వీరే
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల స్థాయిలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ప్రథథమ సంవత్సరంలో జిల్లా ప్రథమ స్థానంలో ఎంపీసీ గ్రూప్‌లో భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కె.రోహిత్ 470 మార్కులకు 463 మార్కులు, బైపీసీలో మెడల్ స్కూల్ కొర్కిశాలకు చెందిన నేహ 440కి 407 మార్కులు, సీఈసీలో భవాని 500కి 437 మార్కులు, ద్వితీయ సంవత్సరం బైపీసీలో కేజీబీవీ టేకుమట్లకు చెందిన ఎం.శిరిష 962, ఎంపీసీలో మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల మోడల్ స్కూల్‌కు చెందిన నిఖిత 928, సీఈసీలో ఎన్.శ్రీంజి 831 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 73శాతం, ప్రథమ సంవత్సరంలో 58శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ త సాధించారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ సంవత్సరంలో 6వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత తగ్గింది. జిల్లాలో 35 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 3,491మంది విద్యార్థులు ఉండగా 2,309 మంది పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో 5 ప్రభుత్వ జూనియర్, 6 మోడల్, 5 ప్రైవేట్, 2 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, 10 కేజీబీవీ, 2 సోషల్ వెల్ఫేర్, 1 మైనారిటీ, 4 బీసీ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి.
జిల్లాలో వచ్చిన ఫలితాలు
2024–25 విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 1,820 మంది విద్యార్థులకు 1,077 మంది (59శాతం) ద్వితీయ సంవత్సరంలో 1,671 మందికి 1,232 మంది విద్యార్థులు (73శాతం) ఉత్తీర్ణులయ్యారు.
గతేడాది కంటే మెరుగు..
జిల్లా 2022–23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 19వ, 2023–24లో 8వ స్థానంలో ఉండగా ఏడాది రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 58 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అత్యధికంగా మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు.
కేజీబీవీల్లో 83శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని 10 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 458 మంది విద్యార్థులు హాజరుకాగా 384మంది ఉత్తీర్ణులై 83శాతం సాధించారు. ప్రథమ సంవత్సరంలో 266 మందికి 212 ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 192మందికి 173 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టేకుమట్ల, మల్హర్, మొగుళ్లపల్లి కేజీబీవీల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
అధ్యాపకుల కృషితోనే..
జిల్లాలో ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలల్లో 73 శాతం మార్కులు సాధించడం సంతోషకర విషయం. జిల్లాలో గత రెండేళ్లుగా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. వారి ప్రేరణతోనే మార్కుల శాతం పెరిగింది. ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తాం.
– వెంకన్న, ఇంటర్ విద్యానోడల్ అధికారి
– వివరాలు 10లోu
ఇంటర్ సెకండియర్‌లో 73శాతం ఉత్తీర్ణత
ప్రథమ సంవత్సరంలో 58శాతం
ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉత్తమ మార్కులు
బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే అధిక సంఖ్యలో పాసయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 68.46 శాతం, బాలురు 43.58శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 79.32 శాతం, బాలురు 65.2శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రతిభ కనబరిచారు. ఉత్తీర్ణత సాధించడంలో బాలురు వెనుకబడిపోయారు.
మే 22నుంచి సప్ల్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు పరీక్ష ఫీజును చెల్లించాలని ఇంటర్ విద్యానోడల్ అధికారి వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రీకౌంటింగ్ చేసుకునే విద్యార్థులు ఆన్‌లైన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు.


