ఆరోగ్యశాఖలో అలసత్వం వహించొద్దు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో వైద్యారోగ్యశాఖ కార్యక్రమాల్లో అలసత్వం వహించొద్దని రాష్ట్ర వైద్యారోగశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధినిరోధక టీకాలు, ఎన్‌సీడీ, లెప్రసీ, టీబీ ఇతర కార్యక్రమాల నిర్వహణలో అలసత్యం వహించొద్దని సూచించారు. ప్రాణహిత పుష్కరాల మెడికల్ క్యాంపు యాక్షన్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీప్యూటీ డీఎంహెచ్‌ఓ, పోగ్రాం అధికారులు కొమురయ్య, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ సందీప్, సపోర్టింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
మెరుగైన సేవలందించాలి
రేగొండ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు క్రమంతప్పకుండా పరీక్షలు చేయించాలని, ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు జరిగే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. కుష్టు, టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికి త్స అందించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను శిశువులందరికీ సకాలంలో వేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని ఫార్మసీ, ల్యాబ్, డెలివరీ, ఓపీ రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. డీఎంహెచ్‌ఓ మధుసూదన్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీదేవి, డాక్టర్ హిమబిందు, హెల్త్ సూపర్‌వైజర్లు సుధ, వినోద లక్ష్మీ, రాజేందర్, రాము, ఫార్మసిస్ట్ సులక్షణ, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్


