కాజీపేట వ్యాగన్‌ ఫ్యాక్టరీలో స్పెషాలిటీస్ ఏముంటాయంటే.? | Lot of specialties in Wagon factory | Sakshi
Sakshi News home page

కాజీపేట వ్యాగన్‌ ఫ్యాక్టరీలో స్పెషాలిటీస్ ఏముంటాయంటే.?

Jul 10 2023 1:18 AM | Updated on Jul 11 2023 1:35 PM

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ శివారులో శనివారం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్‌ల తయారీ పరిశ్రమకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌గా మంజూరైన దీనిని రైల్వే వ్యాగన్‌ తయారీ పరిశ్రమగా అప్‌గ్రేడ్‌ చేశారు. గతంలో సమకూరిన సదుపాయాలకు మరికొన్నింటిని జోడించారు.

దీనిని భారతీయ రైల్వేలో రెండో అతి పెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అభివర్ణించారు. ఇప్పటికే ప్రాజెక్టు మోడల్‌ను ప్రదర్శించారు. రైల్వే బోగి మొదటి షెడ్‌లోకి ప్రవేశించిన తరువాత మరమ్మతులు పూర్తయ్యాక బయటికొస్తుంది. ఇదంతా ఒక క్రమపద్ధతిలో సాగుతుంటుంది. రోబోటిక్‌ సిస్టమ్‌, ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు.. వ్యాగన్ల వర్క్‌షాప్‌, తయారీ ఎలా చేస్తారో ఒకసారి పరిశీలిద్దాం.

పీఓహెచ్‌ నుంచి వ్యాగన్‌ తయారీ యూనిట్‌గా..

● ఇప్పుడున్న వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ నుంచి వ్యాగన్‌ తయారీ యూనిట్‌ మార్పునకు సంబంధించి లేఅవుట్‌లో పలు మార్పులు చేశారు.

● స్లోపింగ్‌ షాప్‌, షీట్‌ మెటల్‌ షాప్‌ ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి.

స్ట్రిప్పింగ్‌ షాప్‌ సరైన జిగ్స్‌, ఫిక్స్చర్లను ఉపయోగించడం ద్వారా సైడ్‌ వాల్స్‌, ఎండ్‌ వాల్స్‌ తయారీకి ఉపయోగించుకోవచ్చు.

● బాడీషాప్‌, వీల్‌షాప్‌, పెయింట్‌ షాప్‌, స్టోర్‌ వార్డులో ఎలాంటి మార్పు

చేయాల్సిన అవసరం లేదు.

● వర్క్‌షాప్‌ మెషినరీ, ప్లాంట్‌లో కొత్తగా గ్యాంగ్‌ డ్రిల్లింగ్‌ మెషిన్‌, షీరింగ్‌ మెషిన్‌, బెంచ్‌ ప్రెస్‌, యూనివర్సల్‌ అండర్‌ ఫ్రేమ్‌ వెల్డింగ్‌ మానిప్యులేటర్స్‌, స్ట్రెయిటెనింగ్‌ మెషిన్‌, హక్‌ బోల్టింగ్‌ మెషిన్‌ తదితర అదనపు పరికరాలు ఏర్పాటు చేస్తారు.

● బోగీ షాప్‌లోనే అదనంగా మరికొన్ని యంత్రాలు వస్తాయి. వ్యాగన్ల తయారీకి అవసరమైన రా మెటీరియల్‌ వస్తుంది. ఇందులోనే వెల్డింగ్‌, బాడీ కటింగ్‌, చక్రాలను అమర్చుతారు. అంతా చేసి వ్యాగన్‌ను రూపొందిస్తారు. ఏది, ఎలా తయారు చేయాలని ఇంజనీర్లకు చెబుతారు.

షవర్‌ టెస్ట్‌ : ఇందులో వ్యాగన్‌ బాడీని ఉంచి నీటి ఫ్రెషర్‌ చేస్తారు. దీంతో బాడీ శుభ్రం కావడంతోపాటు ఏదైనా లీకేజీ ఉంటే నీళ్లు కారడంగానీ, తడిసిపోవడం ఈజీగా తెలిసిపోతుంది. ఒకవేళ లీకేజీలు ఉంటే వ్యాగన్‌ను తిరిగి రిపేర్‌ షాప్‌నకు పంపుతారు. ఎలాంటి లీకేజీ లేకపోతే అన్‌మాస్క్‌ చేసి తిరిగి పేయింట్‌షాప్‌నకు పంపుతారు.

ట్రావెర్సర్‌ : ఇది షాప్‌(షెడ్‌)లకు అనుబంధంగా అటు, ఇటు తిరిగేలా ఇంజన్‌ ఉంటుంది. ఇందులో బోగిని లోపలి భాగం నుంచి లోడ్‌ చేసి వివిధ షాప్‌లకు పంపించే అవకాశం ఉంటుంది. ఇది ట్రాక్‌ టు ట్రాక్‌కు, లైన్‌ టు లైన్‌ అనుసంధానం, షిఫ్ట్‌ చేసేందుకు దోహదపడుతుంది.

పాండ్‌ : 2వేల కేఎల్‌డీ (కిలో లీటర్స్‌ పర్‌ డే) పాండ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ నీటిని వర్క్‌షాప్‌, వ్యాగన్‌ తయారీ పరిశ్రమలో వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు.

అడ్మినిస్ట్రేషన్‌ భవనం : ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులంతా ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు. వ్యాగన్ల తయారీ, మరమ్మతు తదితర అంశాలపై మానిటరింగ్‌ చేస్తారు.

స్టోర్‌వార్డ్‌ : ఇందులో వ్యాగన్‌ (ప్రయాణికులబోగీ), బోగీ (గూడ్స్‌)ల తయారీ, మరమ్మతులు, ఇతర పార్ట్స్‌లను ఇందులోనే భద్రపరుస్తారు. అవసరమైన వాటిని అక్కడినుంచి తీసుకెళ్తారు.

స్క్రాప్‌బిన్స్‌ : పనికిరాని పరికరాలను ఇందులో వేస్తారు. డ్యామేజీలు, కాలం చెల్లినవి, విరిగిపోయిన వాటన్నింటీని స్క్రాప్‌ (చెత్త)కింద వేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement