లింగాలఘణపురం: ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్నీ తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, రవాణా సౌకర్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వపరంగా అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండబోయిన మమతసంపత్, ఈఓ వంశీ, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌మనోహర్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, దేవస్థాన మాజీ చైర్మన్ మూర్తి, నాయకులు కె.కె. రాములు, గణపతి, రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
శ్రీసోమేశ్వరస్వామివారికి వెండి నాగాభరణం
పాలకుర్తి టౌన్: స్వయంభు శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి వారికి మిశ్రమ వెండి నాగాభరణాన్ని ఓ భక్తుడు సమర్పించినట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా మేడిచర్ల చెక్‌పోస్టుకు చెందిన స్వామివారి భక్తుడు అనంతోజు రాజు, స్వర్ణలత దంపతులు రూ. 1,80,000 విలువైన 1022 గ్రాముల మిశ్రమ వెండి నాగాభారణం ఆలయానికి అందజేసినట్లు ఈఓ పేర్కొన్నారు.
నేడు ఇందిరమ్మ బీమా
వివరాల నమోదు
జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఈనెల 20న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించేందుకు అవసరమైన వివరాల నమోదు, సంబంధిత ప్రక్రియలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండలాల వారీగా కార్యక్రమ నిర్వహణ కేంద్రాలు.. బచ్చన్నపేట మండలంలో బచ్చన్నపేట, పడమటికేశవాపురం, చిల్పూర్‌లో చిన్నపెండ్యాల, ఫతేపూర్, దేవరుప్పులలో సింగరాజుపల్లి, కామారెడ్డిగూడెం, ఘనపూ ర్ (స్టేషన్)లో తాటికొండ, ఇప్పగూడెం, జనగామలో ఓబుల్‌కేశవాపూర్, పసరమ డ్ల, కొడకండ్లలో కొడకండ్ల, మొండ్రాయి, లింగాలఘణపురంలో నెల్లుట్ల, నవాబుపేట, నర్మెటలో అమ్మాపూర్, బొమ్మకూరు, పాలకుర్తిలో పాలకుర్తి, చెన్నూరు, రఘునాథపల్లిలో ఇబ్ర హీంపూర్, కన్నాయిపల్లి, తరిగొప్పులలో తరి గొప్పుల,అబ్దుల్ నాగారం, జఫర్‌గఢ్‌లో జఫర్‌గఢ్, దుర్గానాయక్ తండా, ఘన్‌పూర్ మున్సి పాలిటీలో 13వ వార్డు మున్సిపల్ కార్యాల యం, 11వ వార్డు రైతు వేదికలో నిర్వహించనున్నారు.
మున్సిపాలిటీలో..
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని జనగామ మున్సి పాలిటీ పరిధిలో 6వ, 22వ వార్డుల్లో నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 6వ వార్డులో పాత మున్సిపల్ కార్యాలయ భవనం, 22వ వార్డు ప్రజల కోసం కళ్లెం రోడ్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మి నర్సింహా ఫైర్ వర్క్స్ షాప్ పక్కన ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జాతీయస్థాయిలో ఆర్ట్స్ కాలేజీకి 23వ స్థానం
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జాతీ యస్థాయి ఈడబ్ల్యూ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రభుత్వ కళాశాలల (అటానమస్) విభాగంలో 2026–2027 సంవత్సరానికిగాను 23వ స్థానం సాధించింది. ఓవరాల్ స్కోర్ 700లకుగాను 462 స్కోర్ సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎస్‌జ్యోతి గురువారం తె లి పారు. ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకులను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్‌డీ వెంకట్రాంరెడ్డి అభినందించారు.


