గ్రామాలకు ‘గౌరవం’ | - | Sakshi
Sakshi News home page

గ్రామాలకు ‘గౌరవం’

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

జనగామ: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు గౌరవప్రదమైన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ (గ్రామీణ్‌) ఆధ్వర్యంలో స్వచ్ఛ గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా గ్రామపంచాయతీలు, మహిళా సంఘాల (వీఓ), ఆలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద సామూహిక ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు 184 మరుగుదొడ్లు మంజూరు కాగా, వీటి నిర్మాణానికి రూ.3 కోట్ల 25 లక్షల 25 వేల నిధులు కేటాయించారు. వచ్చే జనవరి చివరి వారం నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

184 మరుగుదొడ్లు..

జిల్లాలో మంజూరైన 184 సామూహిక మరుగుదొడ్లలో మహిళా సంఘాల (వీఓ) భవనాల పరిధిలో 124 నిర్మించనున్నారు. ఒక్కోదానికి రూ.1.50 లక్షల చొప్పున కేటాయించారు. ఆలయాలు, గ్రామపంచాయతీల ఆవరణల్లో 46 మరుగుదొడ్లను ఒక్కోదానికి రూ.3 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. అదేవిధంగా 14 అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఒక్కోదానికి రూ.52 వేల చొప్పున నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ పనులకు అయ్యే వ్యయంలో 70 శాతం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిధులు, 30 శాతం గ్రామపంచాయతీ నిధులు వినియోగించాల్సి ఉంటుంది.

కలెక్టర్‌ పర్యవేక్షణలో పనులు

జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 14 చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి.

బండనాగారంలో తొలి అడుగు

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో గురువారం జిల్లాలో తొలి సామూహిక ప్రజా మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేశారు. సర్పంచ్‌ ఇజ్జగిరి రాములు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌బీఎం కరుణాకర్‌, ఉప సర్పంచ్‌ మానేపల్లి మల్లయ్య, వార్డు సభ్యులు బాలలక్ష్మి, మానేపల్లి జయ, ఇజ్జగిరి నరేష్‌, ప్రశాంత్‌తో కలిసి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశు భ్రత, మరుగుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్యం ప్రాముఖ్యంపై ప్రజలకు అవగా హన కల్పించారు.

జిల్లాకు 184 సామూహిక

మరుగుదొడ్లు మంజూరు

రూ.3.25 కోట్లకు పైగా

నిధుల కేటాయింపు

వచ్చే ఏడాది జనవరి చివరి వారంలోగా

పూర్తి చేయాలని లక్ష్యం

బండనాగారంలో తొలి నిర్మాణం

నిర్వహణే ముఖ్యం

మరోవైపు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నుంచి డిసెంబర్‌ 10 వరకు జిల్లాలోని గ్రామపంచాయతీల్లో శ్రీస్వచ్ఛ శౌచాలయ్‌–గరి మామయ్‌ భవిష్యశ్రీ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, పాఠశాలలు, ఇతర సంస్థల మరుగుదొడ్లలో నీటి వసతి, పరిశుభ్రత, మహిళలు, బాలికలు, దివ్యాంగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జనకు అడ్డుకట్ట వేయడం, మహిళలు, బాలికలకు గౌరవప్రదమైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement