దేవరుప్పుల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం మండలంలోని రామరాజుపల్లిలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. తహసీల్దార్ మహమ్మద్ అష్ఫాక్ అహ్మద్, సర్వేయర్లు పాల్గొన్నారు.
గణితం, సైన్స్‌పై పట్టు సాధించాలి
కొడకండ్ల: విద్యార్దులు గణితం, సైన్స్ వంటి కీలక సబ్జెక్ట్‌లపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను వివిధ పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాలను తెల్సుకొని సులువైన అభ్యాసన పద్ధతులను వివరించారు. తహసీల్దార్ అనీల్‌బాబు, హెచ్‌ఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను సవరించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును నవంబర్ 18 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
యువత డ్రగ్స్‌కు నో చెప్పాలి
డ్రగ్స్‌కు నో చెప్పి యువత మత్తు జోలికి వెళ్లకుండా దూరంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నషా ముక్తి భారత్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డా. డి.లవకుమార్ రెడ్డి, కోశాధికారి జి.క్యాథరిన్, దొంతుల శేఖర్, సురేందర్‌రెడ్డి, డా.బి.హేమంత్ రాజు, శివరాజ్ యాదవ్, ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ కన్న పరశురాములు, సీహెచ్.ప్రవీణ్ పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


