లబ్ధిదారుల సంఖ్య 82,983
వితంతువులకే అత్యధిక ప్రాధాన్యం
జనగామ: ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త పింఛన్ల మంజూరుతో వేలాది కుటుంబాల్లో సరి కొత్త ఆశలు చిగురించాయి. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపుతూ జిల్లాలో 9,669 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారికి తోడుగా కొత్త లబ్ధిదారులు చేరడంతో సామాజిక భద్రత పరిధి మరింత విస్తరించనుంది. మండలాల వారీగా లబ్ధిదారుల ఎంపికలో పాలకుర్తి అగ్రస్థా నంలో నిలవగా, వితంతువుల కేటగిరీలో అత్యధిక మందికి అవకాశం దక్కింది. ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూసిన వారికి ఈ మంజూరు కుటుంబ అవసరాలకు అండగా నిలవనుండటంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో కొత్తగా 9,669 మందికి పింఛన్లు
జిల్లాలో ఆసరా తరహా సామాజిక భద్రత పింఛన్లకు సంబంధించి కొత్తగా మరో 9,669 మందికి మంజూరు లభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 73,314 మంది పాత పింఛన్లు పొందుతుండగా, వీరికి రూ.18,24,29,728 చెల్లిస్తున్నట్లు అందుబాటులో ఉన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా మంజూరైన పింఛన్లతో కొత్తగా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. జిల్లాలోని 12 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులకు కేటగిరీల వారీగా పింఛన్లు మంజూరయ్యాయి.
వితంతువులకే అత్యధికం
కొత్తగా మంజూరైన 9,669 పింఛన్లలో వితంతువులకు అత్యధికంగా 5,452 కేటాయించారు. ఆ తర్వాత దివ్యాంగులకు 2,315, కల్లుగీత కార్మికులకు 1,169, ఒంటరి మహిళల్లో వివాహితుల కేటగిరీకి 443, చేనేత కార్మికులకు 215, అవివాహితుల కేటగిరీకి 75 పింఛన్లు మంజూరయ్యాయి. కొత్త పింఛన్లలో సుమారు 56.4 శాతం వితంతువులకే దక్కడం గమనార్హం. దివ్యాంగులకు సైతం 23.9 శాతం కేటాయింపులు జరిగాయి.
పాలకుర్తిలో అత్యధికం..
మండలాల వారీగా పరిశీలిస్తే పాలకుర్తి మండలం 1,113 పింఛన్లతో మొదటి స్థానంలో నిలిచింది. రఘునాథపల్లి మండలంలో 1,000, చిల్పూరులో 881, బచ్చన్నపేటలో 805, జనగామ మండలంలో 777, జఫర్‌గఢ్‌లో 771, లింగాలఘణపురంలో 758 పింఛన్లు మంజూరయ్యాయి. దేవరుప్పులలో 732, జనగామ మున్సిపాలిటీలో 720, స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో 573, కొడకండ్లలో 508, నర్మెటలో 423 పింఛన్లు కేటాయించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 303, తరిగొప్పుల మండలంలో 305 పింఛన్లు మంజూరయ్యాయి.
అవివాహితులు 75
దివ్యాంగులు
జిల్లాలో ఇప్పటికే ఉన్న 73,314 పాత పింఛన్లకు తాజాగా మంజూరైన 9,669 కొత్త పింఛన్లు కలిపితే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 82,983కు చేరుతుంది. కొత్త పింఛన్ల మంజూరుతో సామాజిక భద్రత పరిధి మరింత విస్తరించనుంది. అర్హులైన పేద, బలహీన వర్గాలకు ఈ పింఛన్లు ఆర్థికంగా తోడ్పాటునందించనున్నాయి.
జిల్లాలో కొత్తగా 9,669 మందికి
పింఛన్లు
దివ్యాంగులకు 2,315,
గీత కార్మికులకు 1,169
మండలాల వారీగా లబ్ధిదారుల ఎంపిక
పాత పింఛన్లు 73,314, రూ.18.24 కోట్ల చెల్లింపులు
కొత్త పింఛన్లతో 82,983కు చేరనున్న లబ్ధిదారులు
మొత్తం 9,669
వితంతువులు
5,452
443
చేనేత
215
గీత
1,169
2,315


