నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్ష

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

జనగామ రూరల్‌: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో 10 నాన్‌–టీచింగ్‌ పోస్టులకు ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహాలలో 4 నాన్‌–టీచింగ్‌ పోస్టులకు, నేలపోగులలోని పీఎంశ్రీ రత్నమాల కేసరి ఎంపీయూపీఎస్‌ పాఠశాలలో ఇంగ్లిస్‌, గణిత సబ్జెక్ట్‌ టీచర్లు 2 పోస్టులు, అలాగే మైనారిటీ సంక్షేమ పాఠశాలలో స్టాఫ్‌ నర్స్‌ 1, ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్షను ఆదివారం కలెక్టరేట్‌లో ప్రశాంతంగా నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆధ్వర్యంలో పారదర్శకంగా రాత పరీక్ష నిర్వహించగా పరీక్షల తీరును ఆయన పర్యవేక్షించారు. మొత్తం 17 ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి 188 దరఖాస్తులు రాగా, 157 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 31మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో 10 పోస్టులకు గాను 121 దరఖాస్తులు రాగా, 102 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 19 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఆదర్శ పాఠశాలల 4 పోస్టులకు సంబంధించి 28 దరఖాస్తులు రాగా, 19 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 09 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, జిల్లా ఉపాధి అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement