యూటర్న్‌..సేఫ్టీ ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

యూటర్న్‌..సేఫ్టీ ఎక్కడ?

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డివైడర్లకు పలు ప్రాంతాల్లో యూటర్న్‌లను ఏర్పాటు చేసినప్పటికీ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. సిద్దిపేట, సూర్యాపేట, హనుమకొండ, హైదరాబాద్‌ ప్రధాన రహదారులపై కాలనీల అప్రోచ్‌ రోడ్లు, ముఖ్య కూడళ్ల వద్ద యూటర్న్‌లు ఉండగా, వాటిని గుర్తించే సూచికలు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సిగ్నల్స్‌ పనిచేయక గందరగోళం

ఆర్టీసీ చౌరస్తాలో సాంకేతిక సమస్యలతో గత కొన్ని రోజులుగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కృష్ణకళామందిర్‌ జంక్షన్‌, గాంధీ చౌక్‌, కురుమవాడ, గణేష్‌ స్ట్రీట్‌ ప్రాంతాల్లో నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు లేక వేగంగా వచ్చే వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

రద్దీ ప్రాంతాల్లో అవస్థలు

నెహ్రూపార్కు సమీపంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, కళాశాలలు, రైల్వే స్టేషన్‌ నుంచి వచ్చే వాహనాలతో రద్దీ నెలకొంటోంది. ఉద యం, సాయంత్రం వేళల్లో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సిగ్నల్‌ పాయింట్‌ తప్పనిసరి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. యూటర్న్‌ల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు అకస్మాత్తుగా మలుపులు తీసుకుంటూ సడన్‌ బ్రేకులు వేస్తున్నారు. దీంతో వెనుక వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యూటర్న్‌ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు కాలనీల అప్రోచ్‌ రోడ్ల వద్ద వేగ నియంత్రణ చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించేలా మున్సి పల్‌ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవా లని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కృష్ణకళామందిర్‌ గాంధీ విగ్రహం వద్ద నాలుగు రోడ్ల జంక్షన్‌లో గజిబిజిగా ట్రాఫిక్‌

తరుచూ ప్రమాదాలు జరిగే

చిన్నగేటు అప్రోచ్‌ రోడ్డు

ప్రధాన కూడళ్లలో ప్రమాదాల ముప్పు

ట్రాఫిక్‌ నియంత్రణలో

జాగ్రత్తలు అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement