నేడు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజలు | - | Sakshi
Sakshi News home page

నేడు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజలు

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

జనగామ: పట్టణంలోని వెంకన్నకుంట శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 16న (సోమవారం) ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ప్రారంభ పూజా మహోత్సవ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల భాగస్వామ్యంతో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

రెండు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌ మీదుగా చర్లపల్లి–ధానాపూర్‌ మధ్య ప్రయాణించే రెండు ప్రత్యేక రైళ్లను పొడిగించి నడిపిస్తున్నట్లు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. నవంబర్‌ 30న చర్లపల్లిలో బయలుదేరే చర్లపల్లి–ధానాపూర్‌ (07051) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. డిసెంబర్‌ 1వ తేదీ మంగళవారం ధానాపూర్‌లో బయలుదేరే ధానాపూర్‌–చర్లపల్లి (07052) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ మరుసటి రోజు కాజీపేటకు చేరుకొని వెళ్తుందని అదికారులు పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఛత్‌ పూజలు

కాజీపేట రూరల్‌: బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైల్వే ఉద్యోగులు కాజీపేట ఈఎల్‌ఎస్‌ కాలనీలో ఆదివారం రాత్రి ఛత్‌ పూజలు నిర్వహించారు. సోమవారం ఉద యం 6 గంటలకు రెండోరోజు పూజా కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. రైల్వే ఈఎల్‌ఎస్‌ ఎంప్లాయీస్‌ సంఘ్‌ బ్రాంచ్‌ నుంచి రూ.5 వేలు చత్‌ పూజా కమిటీకి అందించినట్లు నాయకులు బల్వీందర్‌సింగ్‌, బి.మాధవరావు తెలిపారు. రైల్వే సీనియర్‌ డీఈఈ సూర్యనారాయణ, ఏడీఈఈ రాహుల్‌, ఏఐ రాజీవ్‌చౌదరి, కాజీపేట సీఐ శ్యాంసుందర్‌, మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, విజయశ్రీరజాలీ, ఛత్‌పూజ కమిటీ సభ్యులు రంజన్‌కుమార్‌యాదవ్‌, రాంనారాయణ్‌కుమార్‌, ఆనంద్‌కుషన్‌, సరోజ్‌కుమార్‌, సురేష్‌కుమార్‌, ప్రదీప్‌లోండే పాల్గొన్నారు.

ముత్తారంలో అరుదైన శిల్పం

భీమదేవరపల్లి: ముత్తారంలోని ప్రాచీన త్రికూటేశ్వర ఆలయం సమీపంలో ఉన్న చెరువుకట్ట ఎగువ భాగంలో (చిన్న బోడుపై) శిరస్సులేని అరుదైన శిల్పం ఆదివారం కనిపించింది. ఇప్పటివరకు స్థానికులు దీనిని నల్లపోచమ్మ తల్లిగా భావించి పూజించారు. చరిత్రకారులు ప్రాచీన వీరభద్రస్వామి విగ్రహమని తేల్చారు.

శిల్పం విశేషాలు..

కొత్త తెలంగాణ చరిత్ర బందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ శిల్పంపై ఉన్న ఆయుధాలు, ఆభరణాల ఆధారంగా వివరాలు వెల్లడించారు. విగ్రహంపై కుడి చేతిలో ఢమరుకం, పైఎడమ చేతిలో త్రిశూలం ఉన్నాయి. కింది కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో రక్తపాత్ర స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెడలో హారం, గ్రైవేయకాలు, వక్షస్థలంపై జంధ్యం, నడుముకు కటిమేఖలు, చేతులకు కంకణాలు, కాళ్లకు కడియాలతో పాటు మోకాళ్ల కింద రాక్షసుల తలలు చెక్కి ఉన్నాయి. ఈ తరహా శిల్ప లక్షణాలు మల్లన్న (మల్లికార్జున స్వామి) విగ్రహాలకు కూడా ఉంటాయని కొందరు అభిప్రాయపడగా, దీనిపై హరగోపాల్‌ స్పష్టతనిచ్చారు. వీరభద్రుని శిల్పాలను కాలక్రమేణా కొన్ని ప్రాంతాల్లో మల్లన్న దేవుడిగా కొలుస్తున్నారని వెల్లడించారు. ఈ అరుదైన శిల్పాన్ని సంరక్షించాలని చరిత్రకారులు కోరుతున్నారు.

కేయూ అభివృద్ధికి

సహకరించాలి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి పూర్వవిద్యార్థులు సహకరించాలని రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం కోరారు. కేయూ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా 1978–1980 విద్యాసంవత్సరంలోని 10 విభాగాల పీజీ కోర్సుల బ్యాచ్‌ పూర్వవిద్యార్థుల సమ్మేళనం పరిపాలనా భవనం సెనెట్‌హాల్‌లో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ హాజరై మాట్లాడారు. 1976లో స్థాపించిన కేయూ రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా ఎదిగిందని తెలిపారు. నాటి వీసీ కె.వెంకట్రామయ్య మొదలుకొని ప్రస్తుత వీసీ కె.ప్రతాప్‌రెడ్డి వరకు వివిధ దశల్లో యూనివర్సిటీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. కాగా, 46 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. యూనివర్సిటీ రిటైర్డ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఆచా ర్య వడ్డె రవీందర్‌ అధ్యక్షత వహించారు. మాజీ వీసీ విద్యావతి, మాజీ రిజిస్ట్రార్లు ఆచార్య సాయిలు, పురుషోత్తమ్‌రావు, జగన్నాథ స్వామి, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement