అమరుల సేవలు వెలకట్టలేం : సీపీ శ్వేత | - | Sakshi
Sakshi News home page

అమరుల సేవలు వెలకట్టలేం : సీపీ శ్వేత

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

అమరుల సేవలు వెలకట్టలేం : సీపీ శ్వేత

హసన్‌పర్తి: అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అమరులను స్మరిస్తూ మంగళవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. సీపీ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, డీసీపీ దార కవితలతోపాటు అధికారులు ర్యాలీలో పాల్గొని అమరులకు నివాళులర్పించారు. ప్రజల భద్రతకోసం ప్రాణాలు అర్పించిన పోలీస్‌ అమరుల సేవలు వెలకట్టలేమన్నారు. ఈ ర్యాలీ వారికి అంకితమన్నారు. ర్యాలీలో పాల్గొన్న నగరానికి చెందిన 89 ఏళ్ల నర్సయ్య అనే వృద్ధుడిని సీపీ అభినందించారు. కార్యక్రమంలో డీసీపీలు వి.శ్రీనివాస్‌, సురేష్‌, అంకిత్‌కుమార్‌, ఏసీపీ నర్సింహారావు, మడికొండ సీఐ కిషన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement