వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిదాయకం

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

జనగామ రూరల్‌: వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచించిన రామాయణం మానవాళికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మహర్షి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అలాగే రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, ఆర్టీఏ సభ్యుడు చిలువేరు అభిగౌడ్‌, జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు.. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎన్‌ఎల్‌ నరసింహారావు, వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు కెంగర్ల మల్లేష్‌, కార్యదర్శి వెంకటేష్‌, సంఘం సభ్యులు, సీనియర్‌ పాత్రికేయులు కన్నా పరశురములు, జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశం, టికేవీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

‘10 రోజుల్లో ఆర్డీఓ ఎదుట హాజరుకావాలి’

జనగామ రూరల్‌: పట్టణ పరిధిలోని శామీర్‌పేట గ్రామంలో మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాల పట్టాలు పొందిన వారిలో, 2023లో ఆచూకీ లభించని 665 మంది లబ్ధిదారులు తమ పట్టా ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులతో 10 రోజుల్లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆర్డీఓ గోపీరామ్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో శామీర్‌పేట గ్రామంలో ఇళ్లు లేని నిరుపేద, బలహీన వర్గాల వారికి ఇంటి స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం భూసేకరణ చేసి, అర్హులకు పట్టాలు పంపిణీ చేసిందని, అయితే 2023లో ఆచూకీ లభించని 665 మంది పేర్లతో కూడిన జాబితాను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ జాబితాను జనగామ మున్సిపల్‌, మండల పరిషత్‌, తహసీల్దార్‌ కార్యాలయం, జ నగామ నోటీసు బోర్డులతో పాటు సంబంధిత ప్రాంతంలోనూ ప్రదర్శించినట్లు చెప్పారు. జాబితాను https:// jangaon.telangana.gov.in పోర్టల్‌లో ఉంచినట్లు తెలిపారు.

‘పారామెడికల్‌’ దరఖాస్తు గడువు పొడిగింపు

జనగామ: తెలంగాణ పారామెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 31వరకు పొడిగించినట్లు జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ నాగమణి సోమవారం తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండేళ్ల వ్యవధి కలిగిన మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌ డిప్లొమా కోర్సులో 30 సీట్లు, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ డిప్లొమా కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ రెండు కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చ ని వివరించారు. ఆ విభాగాలకు చెందిన విద్యార్థులు అందుబాటులో లేని పక్షంలో ఇతర ఇంటర్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తుల ను జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి

జనగామ రూరల్‌: విద్యుత్‌ వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ కార్యాలయంలో అధిక విద్యుత్‌ వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. పరిశ్రమలు, రైస్‌ మిల్లులు, ఇతర వాణిజ్య సంస్థల్లో విద్యుత్‌ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యుత్‌ శక్తి మెరుగుపరిచే పరికరాలను వినియోగించడం ద్వారా విద్యుత్‌ నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. బిల్లులను సకాలంలో చెల్లించాలని తెలిపారు. సమావేశంలో రైస్‌ మిల్లర్లు, కాటన్‌ ప్రతినిధులు సురేందర్‌, మహాలక్ష్మి, శంకర్‌, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్ల డీఈలు, ఏడీఈలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement