అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

● పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

● జాగరూకత అవగాహన వారోత్సవాలు ప్రారంభం

హసన్‌పర్తి: అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. భారత తొలి ఉప ప్రధాని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత, సమగ్రత, దేశ సమైక్యత ప్రాధాన్యాన్ని చాటి చెప్పేలా ‘సత్యనిష్టతో సమృద్ధి’ అంశంతో ఈనెల 26వ తేదీ నుంచి నవంబర్‌ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాగరూకత అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ అఽధికారులు, సిబ్బంది అవినీతి నిరోధక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు డీసీపీలు వి.శ్రీనివాస్‌, సురేశ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ మధుసూదన్‌, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, సీపీఎస్‌ ఏసీపీ సదయ్య, సుదీంధ్ర, నాగయ్య, అంతయ్య, ఆర్‌ఐలు స్పర్ధన్‌రాజ్‌, సతీష్‌, శ్రీధర్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాణసంచా విక్రయాలకు దరఖాస్తులు

చేసుకోవాలి

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణ సంచా విక్రయాల కేంద్రాల ఏర్పాటుకు అనుమతి కోసం దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. ఆసక్తి ఉన్న వారు నవంబర్‌ 2వ తేదీ లోపు పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సీపీ సోమవారం ప్రకటన విడుదల చేశారు. అవసరమైన ఽధ్రువీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తులను డీసీపీ కార్యాలయంలో అందించాలని తెలిపారు. అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement