● ఏఐసీసీ పరిశీలకుడు కేబీఆర్ నాయుడు
జనగామ: ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులు, తొలగింపులు జరిగే ప్రమాదం ఉందని ఏఐసీసీ పరిశీలకుడు కేబీఆర్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు అనుకూలమైన ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌లో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ సమన్వయకర్త అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ, మాజీమంత్రి బస్వరాజు సారయ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జ్ దుద్దిళ్ల శ్రీనుబాబు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణిశ్రీనివాస్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రమోద్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణరెడ్డి, కంచ రాములు, రాజమౌళి, డీసీసీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, కొత్త కరుణాక ర్‌రెడ్డి, ఉడత రవి, వేముల మల్లేష్, బడికె ఇందిర, లోకుంట్ల ప్రవీణ్, జాయ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


