ఉత్సాహంగా ‘పీఎంశ్రీ’ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘పీఎంశ్రీ’ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి పీఎం శ్రీ పాఠశాలల క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని 15 పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన దాదాపు 700 మంది క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడోత్సవాల ప్రారంభ సమావేశానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. పాఠశాలల క్రీడల కార్యదర్శి జాతోతు గోర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలల్లో నిర్వహించే క్రీడల్లో పాల్గొనాలన్నారు. సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి గంగసాని శ్రీకాంత్‌ రెడ్డి, మెరుగు రామరాజు, 19 ఏళ్ల బాలబాలికల పాఠశాలల క్రీడల కార్యదర్శి అజ్మీర కిషన్‌, పీఎంశ్రీ పాఠశాలల క్రీడల పరిశీలకులు భారత రవీందర్‌, అయిత భానుప్రసాద్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు మనోజ్‌ కుమార్‌, హనుమంతరావు, అశోక్‌ కుమార్‌, కిరణ్‌, లచ్చి రాం, వీరియా నాయక్‌, రవి కుమార్‌, రంజిత్‌, కుద్దూస్‌, మాధవి, సుధారాణి, శ్రీదేవి, యాదగిరి, శ్రీనివాస్‌, అశోక్‌, సాయి కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement