● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జనగామ: కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మీ నారాయణ నాయక్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు.. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించడంతో పాటు, ప్రజాసేవకు అంకితమయ్యే కార్యకర్తలను తీర్చిదిద్దడంలో సేవాదళ్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతీ కార్యకర్త అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో నూకల బాల్‌రెడ్డి, వేముల మల్లేశ్ మహారాజ్, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణ, బిర్రు సత్యనారాయణ, కిష్టయ్య, ఉప్పలయ్య, వెంకటలక్ష్మి, మేకల మల్లేశం, ఇస్మాయిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


