‘ఆయుష్‌’ పోస్టుల రాత పరీక్ష ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

‘ఆయుష్‌’ పోస్టుల రాత పరీక్ష ప్రశాంతం

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

జనగామ రూరల్‌: జాతీయ ఆయుష్‌ మిషన్‌ (ఎన్‌ఏఎం) పరిధిలో ఆయుష్‌ ప్రజారోగ్య కార్యక్రమాల అమలులో భాగంగా జిల్లాలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఐదు కేటగిరీల్లో 8 పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ ఆవరణలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పర్యవేక్షణలో పరీక్ష పారదర్శకంగా జరిగింది. 8 పోస్టులకు 229 దరఖాస్తులు రాగా, 208 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మరో 21 మంది గైర్హాజరయ్యారు. ఆయుష్‌ వైద్యాధికారుల విభాగంలో 3 పోస్టులకు 63 దరఖాస్తులు రాగా, 47 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫార్మసిస్ట్‌ విభాగంలో ఒక పోస్టుకు 39 దరఖాస్తులు రాగా, 39 మంది పరీక్షకు హాజరయ్యారు. మానసిక సామాజిక సలహాదారుకు ఒక పోస్టుకు 7 దరఖాస్తులు రాగా, ఏడుగురు పరీక్ష రాశారు. యోగా నిపుణుల విభాగంలో ఒక పోస్టుకు 5 దరఖాస్తులు రాగా, ఐదుగురు హాజరయ్యారు. బహుళ ప్రయోజన సిబ్బంది విభాగంలో రెండు పోస్టులకు 115 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 110 మంది పరీక్షకు హాజరయ్యారు. రాత పరీక్ష అనంతరం ఆయుష్‌ వైద్యాధికారులు, యోగా నిపుణుల పోస్టులకు సంబంధించి 52 మంది అభ్యర్థులకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, జిల్లా ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి, జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ మమత, ఎస్‌.సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement