ఏటా రూ.30 వేల అదనపు ఖర్చు | - | Sakshi
Sakshi News home page

ఏటా రూ.30 వేల అదనపు ఖర్చు

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. వరి సాగు ద్వారా సుమారు 200 ఎండుగడ్డి కట్ట లు లభిస్తున్నాయి. ఇది ఏడాది పొడవునా పశువులకు సరిపోవడం లేదు. అదనంగా గడ్డి కొనుగోలు చేసేందుకు ఏటా రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నాం.

–సింగిరి రాజేందర్‌, చీటకోడూరు

పాల దిగుబడి తగ్గింది

వర్షాలు లేక పచ్చగడ్డి ఎండిపోయింది. పశువులకు మేత దొరకక పాల దిగుబడి తగ్గింది. రెండు గేదెలు రోజుకు ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే పరిస్థితుల్లో నాలుగుకు తగ్గాయి. గడ్డి కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి పాల విక్రయాలతో తిరిగి వచ్చే పరిస్థితి లేదు.

–ఎ.కనకయ్య, కొడవటూరు, బచ్చన్నపేట

ధరలు పెరిగే అవకాశం ఉంది

నాకు ఆరు గేదెలు, పన్నెండు ఆవులు ఉన్నాయి. పశుగ్రాసం కొరత, ఉష్ణోగ్రతలు పెరగడంతో పాల దిగుబడి తగ్గింది. గతంలో 22 లీటర్లు ఇచ్చేవి. ప్రస్తుతం రెండు కలిపి 18 లీటర్లు మాత్రమే ఇస్తున్నాయి. గతంలో ఎండుగడ్డి కట్ట రూ.80 నుంచి రూ.100 వరకు ఉండగా, ఈసారి ధరలు పెరి గాయి. –గాండ్ల రాజు, స్టేషన్‌ ఘన్‌పూర్‌

సగానికి తగ్గిన పాల ఉత్పత్తి

వ్యవసాయంతో పాటు పాడి గేదెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాను. ఈసారి వర్షాలు లేక పచ్చగడ్డి దొరకక ఎండుగడ్డితో పశువులను పోషించాల్సి వస్తోంది. ప్రస్తుతం పాల దిగుబడి సగానికి పడిపోయింది. గడ్డి కొరతతో ధరలు పెరిగే అవకాశం ఉంది. –మంద భూపాల్‌, వడ్డేగూడెం, జఫర్‌గఢ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement