పాఠశాలల్లో ఈ–వ్యర్థాల సేకరణకు కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో ఈ–వ్యర్థాల సేకరణకు కార్యాచరణ

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

● ఈ నెల 28న అన్ని పాఠశాలల్లో

అవగాహన

● కలెక్టర్‌ సందీప్‌ కమార్‌ ఝా

జనగామ రూరల్‌: పర్యావరణ పరిరక్షణ, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సురక్షిత నిర్వహణపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో ‘జీవన విధానం కోసం పర్యావరణ సంఘాలు–ప్రత్యేక ప్రచార కార్యక్రమం–6’లో భాగంగా ఈనెల 28న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ–వ్యర్థాల అవగాహన, సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి సందీప్‌ కుమార్‌ ఝా వెల్లడించారు. ప్రతీ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని వ్యర్థాల సమన్వయకర్తగా నియమించి, నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, అక్షరపలకలు, మౌస్‌లు, విద్యుత్‌ ఛార్జర్లు, తీగలు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలను గుర్తించి వాటి వివరాలు నమోదు చేయాలన్నారు. మండల విద్యాధికారులు సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకొని మండలాల వారీగా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వ్యర్థాలను అప్పగించే ముందు వాటి పేరు, రకం, పరిమాణాన్ని https://ecoclubs. education.gov.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ, బాధ్యతాయుత వినియోగం, వ్యర్థాల వర్గీకరణ, ప్రకృతి వనరుల సంరక్షణపై అవగాహన పెంపొందించాలని విద్యాశాఖ కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement