చిత్రకళే నా వృత్తి.. ప్రవృత్తి | - | Sakshi
Sakshi News home page

చిత్రకళే నా వృత్తి.. ప్రవృత్తి

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

మా తండ్రి మధురం పుల్లయ్య రచయిత, నటుడు, చిత్రకారుడు కావడంతో అనువంశికంగా చిత్రకళ అబ్బింది. జానపద, నవ్యరీతుల్లో సాధన చేస్తూ సొంత శైలిని అభివృద్ధి చేసుకున్న. 1980లో చిత్రకళా ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాను. రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక అవార్డులు అందుకున్న. చిత్రకళను ప్రోత్సహించడమే కాకుండా, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న.

– మధురం రాజేంద్రప్రసాద్‌, చిత్రకళా ఉపాధ్యాయుడు, జనగామ

జనగామ: కళ అనేది కేవలం వినోదం కాదు.. అది మనిషి భావోద్వేగాలకు, ఆలోచనలకు, సంస్కృతికి ప్రతిరూపం. రంగులు, రేఖలు, శిల్పాలు, సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం ఇలా విభిన్న రూపాల్లో కళాకారులు సమాజానికి తమ సృజనాత్మకతను పరిచయం చేస్తుంటారు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం (ఇంటర్నేషనల్‌ ఆర్టిస్ట్‌ డే) సందర్భంగా కళాకారుల పాత్ర, వారి కృషి, ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక కథనం.

సంస్కృతి, సంప్రదాయాలకు వారధులు

కళాకారురు తమ కళ ద్వారా సమాజంలోని ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, మార్పులను ఆవిష్కరిస్తారు. ఒక చిత్రకారుడి కుంచె సమాజంలోని వాస్తవాలను రంగుల్లో చూపిస్తే, శిల్పి తన సృష్టితో చరిత్రను సజీవంగా నిలుపుతాడు. కళను నమ్ముకొని జీవించే అనేక మంది కళాకారులకు ఆర్థిక భద్రత ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. గ్రామీణ, జానపద కళాకారులకు తగిన అవకాశాలు లేకపోవడం, ప్రదర్శనలకు ఆశించిన పారితోషికం లభించకపోవడం, కొత్త తరంలో కళలపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.

ఆదరణ పెరిగినప్పుడే

కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, సాంస్కృతిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరిన్ని వేదికలు కల్పించాలి. కళా ప్రదర్శనలు, శిక్షణ శిబిరా లు, పోటీలు నిర్వహించడంతో పాటు ప్రతిభావంతులకు ఆర్థిక సహాయం, గుర్తింపు అందించాలి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు కళలపై ఆసక్తి పెంపొందించాలి. కళాకారుడిని గౌరవించడం అంటే ఒక వ్యక్తిని మాత్ర మే కాదు, సమాజపు సంస్కృతి, చరిత్ర, సృజనాత్మకతను గౌరవించడం. కళలకు ఆదరణ పెరిగినప్పుడే కళాకారుల జీవనానికి భరోసా లభిస్తుంది. వారి సృజనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కినప్పుడే కళా ప్రపంచం మరింత వికసిస్తుంది.

కళాకారులు

గీసిన చిత్రాలు

కుంచె నుంచి కళారంగం వరకు

సృజనాత్మక ప్రయాణం

సంస్కృతి, సంప్రదాయాలకు వారధులు

నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement