నూతన యంత్రం ఏర్పాటుకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

నూతన యంత్రం ఏర్పాటుకు భూమిపూజ

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

‘సూపర్‌’ను సందర్శించిన డీఎంఈ

జనగామ: మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్‌ యార్డులో తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించేందుకు డ్రై అండ్‌ వెట్‌ వేస్ట్‌ సెగ్రిగేషన్‌ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రం ఏర్పాటులో భాగంగా జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ శనివారం భూమిపూజ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించడం, తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించడం ఈ యంత్రం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌

జనగామ రూరల్‌: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌ విడుదలైనట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సందీప్‌ కుమార్‌ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1–11–2026 నాటికి కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు ఫారం–18 దరఖాస్తును నియమిత అధికారికి సమర్పించాలన్నారు. నవంబర్‌ 6 వరకు ఫారం–18 దరఖాస్తులు స్వీకరిస్తారని, నవంబర్‌ 20 వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి, నవంబర్‌ 25న డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారన్నారు.

విద్యుత్‌ బిల్లులు

సకాలంలో చెల్లించాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: విద్యుత్‌ వినియోగదారులు బిల్లులను సకాలంలో చెల్లించేలా విద్యుత్‌ అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్‌పీడీసీఎల్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ డీఈ బి.సారయ్య అన్నారు. స్థానిక విద్యుత్‌ ఏఈ కార్యాలయంలో విద్యుత్‌ సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వరుస సెలవుల కారణంగా బిల్లుల వసూళ్ల ప్రక్రియ మందగించిందని, నెల చివరి వారం కావడంతో బకాయిల వసూలు నిర్దేశిత లక్ష్యం చేరుకోవాలంటే వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఏఏఓ చంద్రశేఖర్‌, అధికారులు కొమురయ్య, మహేందర్‌రెడ్డి, రాములు, అన్వర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలకు

ప్రాధాన్యం ఇవ్వాలి

జనగామ రూరల్‌: యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఏఓ అంబికా సోని అన్నారు. శనివారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచనల మేరకు కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ విత్తనాల డీలర్లు, మహిళా శక్తి రైతు సేవా కేంద్రాల డీలర్లతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ జొన్న, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, శనగ వంటి ఆరుతడి పంటలతో పాటు కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించకుండా అనుమతులు కలిగిన, లేబుల్‌పై అవసరమైన వివరాలు ఉన్న విత్తనాలను మాత్రమే డీలర్లు విక్రయించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు డీఆర్‌డీఓ అధికారి నూరుద్దీన్‌, ఏడీఏలు అపర్ణ, వసంత సుగుణ, మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

కాశిబుగ్గ: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని డీఎంఈ డాక్టర్‌ వాణి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె నిర్మాణ పనులతోపాటు రోగులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఇప్పటికే ఓపీ సేవల ప్రారంభం కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఫస్ట్‌ ఫ్లోర్‌లో చేసిన ఏరాట్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే, మిగిలిన ఫోర్లల్లో పనులు పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగినట్లు సమాచారం. పనులు పూర్తి అయితేనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందని, అధికారులు సమన్వయంతో పనిచేసి వైద్య సేవల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement