రీసర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రీసర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

జనగామ రూరల్‌: భూ రీసర్వే మొదటి దశ పనులను వేగవంతం చేసి, ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం భూ రీసర్వే పనుల పురోగతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ బెన్షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వీసీలో హాజరయ్యారు. సీసీఎల్‌ఏ కమిషనర్‌ మాట్లాడుతూ భూ రీసర్వే మొదటి దశలో ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో సర్వే పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వీసీలో సర్వే అండ్‌ ల్యాండ్స్‌ ఏడీ మన్యంకొండ, డీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్‌ అవర్‌లో వైద్య చికిత్స అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్‌ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. ప్రమాద బాధితులకు చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా సమీపంలోని ఆసుపత్రుల్లో తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ, పథకం పరిధిలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు రోడ్డు ప్రమాద కేసులను నేషనల్‌ హెల్త్‌ అథారిటీకి చెందిన టీఎంఎస్‌ 2.0 పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఈ–డీఏఆర్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణలు, ఆమోదాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ చేయాలని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వీసీలో డీఎంహెచ్‌ఓ వాణి శ్రీ, ఈఈ పీఆర్‌ రవీందర్‌, డీపీఓ వెంకట్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ ఫణి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వీసీలో సీసీఎల్‌ఏ కమిషనర్‌

లోకేష్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement